India vs Afghanistan Highlights: టీ20 వరల్డ్ కప్‌లో బోణికొట్టిన భారత్

India vs Afghanistan Highlights: ఆఫ్ఘనిస్తాన్ పై 66 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా

Shireesha
Updated on: 4 Nov 2021 11:31 AM IST
India Won Match Against Afghanistan T20 World Cup 2021 Highlights | Cricket News
X

India vs Afghanistan Highlights: టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో బోణికొట్టి భారత్

India vs Afghanistan Highlights: టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 66 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మెగా ఈవెంట్ లో తొలి గెలుపును నమోదు చేసింది భారత జట్టు. పాకిస్తాన్, న్యూజీలాండ్ చేతిలో వరుస పరాజయం పాలై విమర్శలు మూటకట్టుకున్న కోహ్లీసేనా ఈ మ్యాచ్ లో చెలరేగిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సెమీస్ అవకాశాలు లేని వేళ అఫ్ఘన్ జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచి అభిమానులను ఆకట్టుకుంది.

టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ 69 పగులు, రోహిత్ శర్మ 74 పరుగులతో చెలరేగారు. రిషబ్ పంత్ 27, హార్ధిక్ పాండ్యా 35 రాణించి అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది టీమిండియా జట్టు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన అఫ్ఘనిస్తాన్ టార్గెట్ చేధించలేకపోయింది. 144 పరుగులకు చేతులెత్తేసింది. 20 ఓవర్లు ఆడిన అఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్‌ శర్మ ప్లేయర్‌​ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Shireesha

Shireesha

Next Story