India vs Sri Lanka 2nd T20 Highlights: ధర్మశాల టీ20లో భారత్‌ గెలుపు

India vs Sri Lanka 2nd T20 Highlights: * రాణించిన శ్రేయస్‌ అయ్యర్, జడేజా * ఒక మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్ భారత్ కైవసం

Shireesha
Published on: 27 Feb 2022 7:15 AM IST
India Won by 7 Wickets in India vs Sri Lanka 2nd T20 Match Highlights | Sports News
X

India vs Sri Lanka 2nd T20 Highlights: ధర్మశాల టీ20లో భారత్‌ గెలుపు

India vs Sri Lanka 2nd T20 Highlights: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. లంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ 74 పరుగులతో రాణించగా.. రవీంద్ర జడేజా 45, సంజూ శాంసన్‌ 39 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో.. ఒక మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను రోహిత్‌ సేన కైవసం చేసుకుంది. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార రెండు, దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టారు.

Shireesha

Shireesha

Next Story