Ind vs Eng: నాలుగో టెస్ట్‌లో 157 పరుగుల తేడాతో భారత్‌ విజయం

Ind vs Eng: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం

Sandeep Eggoju
Published on: 7 Sept 2021 8:18 AM IST
India Won by 157 Runs in Fourth Test Match
X

ఇంగ్లాండ్ పై 157 పరుగులతో విజయ్ సాధించిన ఇండియా (ఫోటో ట్విట్టర్)

Ind vs Eng: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా రఫ్పాడించింది. 157 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. భాత జట్టు విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్స్ ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక భూమిక పోషించారు. దీంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది.

నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన చేతులెత్తేసింది. 191 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పుంజుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. మిగతా ఆటగాళ్లు కూడా మెరుగైన ఆటతీరు ప్రదర్శించారు. శార్దుల్, పంత్‌ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.

ఇక బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 77 పరుగులు చేసింది. ఐదో రోజు ఇంగ్లాండ్ 291 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ భారత బౌలర్లు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్స్‌ను చెడుగుడు ఆడుకున్నారు. క్రీజులో పాతుకుపోయేందుకు ఎంత ప్రయత్నించినా నిలవలేకపోయారు. దీంతో ఆతిథ్య జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీసేన 157 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story