కోహ్లీషో.. టీమిండియా గెలుపు

కోహ్లీషో.. టీమిండియా గెలుపు
x
Highlights

కోహ్లీ క్లాసికల్ బ్యాటింగ్ తొ టీమిండియా దక్షిణాఫ్రికా పై ఘన విజయం సాధించింది. ఆరు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయానికి కావలసిన 150 పరుగులు...

కోహ్లీ క్లాసికల్ బ్యాటింగ్ తొ టీమిండియా దక్షిణాఫ్రికా పై ఘన విజయం సాధించింది. ఆరు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయానికి కావలసిన 150 పరుగులు సాధించింది. కోహ్లీ 52 బంతుల్లో 72 పరుగులు చేశాడు. విజయానికి 150 పరుగులు చేయాల్సిన లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు రోహిత్, ధావన్ మంచి ప్రారంభం ఇచ్చారు. అయితే, నాలుగో ఓవర్లో పెహుక్వేయా బౌలింగ్ లో రోహిత్ శర్మ 12 పరుగులకు అవుటయ్యాడు. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ, ధావన్ తొ కలసి లక్ష్యం వైపు మెల్లగా దూసుకుపోయాడు. కానీ, దూకుడు మీద ఉన్న ధావన్ 40 పరుగులు చేసి అవుటయ్యాడు. తరువాత వచ్చిన రిశాబ్ పంత్ నిరాశపరిచాడు. దీంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కోహ్లీకి జతగా నిలవడంతో కోహ్లీ దూకుడుగా ఆడి 72 పరుగులు చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories