India Vs Sri Lanka: ఇవాళ్టి నుంచి భారత్, శ్రీలంక టీ20 సిరీస్

India Vs Sri Lanka: లక్నో వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్

Rama Rao
Published on: 24 Feb 2022 7:16 AM IST
India Vs Sri Lanka T20 Series From Today | Sports News
X

ఇవాళ్టి నుంచి భారత్, శ్రీలంక టీ20 సిరీస్

India Vs Sri Lanka: టీ20 ప్రపంచ కప్ టోర్నీ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. నేడు మరో సమరానికి టీమిండియా సిద్ధమైంది. లక్నో వేదికగా శ్రీలంక జట్టుతో మూడు టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను టీ20 సిరీస్‌లో 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో దారుణంగా వైఫల్యం చెందిన శ్రీలంక జట్టు సత్తా చాటాలని భావిస్తోంది. ఇక యువ ఆటగాళ్లతో టీమిండియా మరోసారి ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా నేడు తొలి టీ20 జరగనుంది.

Rama Rao

Rama Rao

Next Story