India vs South Africa 2nd Test: విరాట్‌ కోహ్లీ అర్ధ సెంచరీ.. తొలి రోజు ఆటముగిసే సరికి భారత్ స్కోరు 273 - 3

India vs South Africa 2nd Test: విరాట్‌ కోహ్లీ అర్ధ సెంచరీ.. తొలి రోజు ఆటముగిసే సరికి భారత్ స్కోరు 273 - 3
x
Highlights

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటిరోజు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. 91 బంతుల్లో 8 ఫోర్లతో విరాట్‌ అర్ధ సెంచరీ పూర్తి...

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటిరోజు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. 91 బంతుల్లో 8 ఫోర్లతో విరాట్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 23వ అర్ధసెంచరీ. తగిన వెలుతురు లేక అంపైర్లు తొలిరోజు ఆటను 85.1 ఓవర్ల వద్ద నిలిపివేశారు.

ఆట ముగిసే సమయానికి భారత్‌ స్కోరు 273 - 3 గా ఉంది. విరాట్‌ కోహ్లీ 63 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రహానే 18 పరుగులతో (70 బంతులు) తగిన సహకారాన్ని అందిస్తున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 బంతుల్లో 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అంతకు ముందు తొలి టెస్టు హీరో రోహిత్‌ శర్మ (14) తక్కువ స్కోరుకే అవుటవగా, వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా (58) అర్ధసెంచరీ చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సమయోచితంగా ఆడుతూ సెంచరీ (108) చేసిన కొద్దిసేపటికే స్లిప్‌లో దొరికిపోయాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories