India vs England: టెస్టు సిరీస్‌ భారత్‌ కైవసం

India vs England: నాలుగో టెస్టులో ఇన్నింగ్స్‌ 25 పరుగులు తేడాతో విజయం. 135 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్‌. 3-1 తేడాతో గ్రాండ్ విక్టరీ. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల హవా.

Arun Chilukuri
Updated on: 6 March 2021 4:08 PM IST
India vs England, 4th Test,  India win by an innings and 25 runs
X

టెస్టు సిరీస్‌ భారత్‌ కైవసం

India vs England: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. 3_1 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. నాల్గో టెస్టులో ఇన్నింగ్స్‌ 25 పరుగులు తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో కూడా చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. 135 పరుగులకే బొక్కబోర్లా పడ్డారు. అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు మరోసారి చెలరేగారు. ఇంగ్లిష్‌ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ఇంగ్లండ్‌ ఆటకట్టించారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 205 పరుగులు చేయగా..రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 365 పరుగులు చేసింది. రిషభ్‌పంత్‌ సెంచరీ చేయగా వాషింగ్టన్‌ సుందర్‌ 96 పరుగులు చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story