సచిన్‌ రికార్డును అధిగమించిన కోహ్లీ

Arun Chilukuri
Published on: 2 Dec 2020 11:21 AM IST
సచిన్‌ రికార్డును అధిగమించిన కోహ్లీ
X

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. సచిన్‌ 300 ఇన్సింగ్స్‌లలో ఈ మైలురాయిని దాటగా కోహ్లీ తన 242వ ఇన్నింగ్స్‌లోనే దీనిని అందుకున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story