ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైన టీమిండియా

Arun Chilukuri
Published on: 12 Nov 2020 9:22 AM IST
ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైన టీమిండియా
X

భారత జట్టు ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైంది. ఈనెల 27న జరగనున్న ఆసీస్‌తో టూర్ నేపథ్యంలో ఇవాళ దుబాయ్ నుంచి బయలుదేరనుంది టీమిండియా. నేరుగా సిడ్నీ వెళ్లనున్న జట్టు కొవిడ్ నిబంధనల ప్రకారం అక్కడే క్వారంటైన్‌లో ఉంటూ ప్రాక్టీస్ చేయనుంది. టెస్టులకు మాత్రమే ఎంపిక అయిన పుజారా, హనుమ విహారి డే అండ్ నైట్ టెస్టుల కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయనున్నారు. ఇక రోహిత్‌ శర్మ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పూర్తిగా కోలుకున్నాక ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అటు ఇన్నాళ్లూ ఐపీఎల్‌ కోసం యూఏఈలో ఉన్న ఆసీస్ ప్లేయర్లు కూడా ఇండియా టీమ్‌తో కలిసి సిడ్నీకి బయలుదేరే అవకాశాలున్నాయి. కంగారూ గడ్డపై భారత్‌ మొదటగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌, ఇండియా తలపడనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story