IND vs NZ 3rd T20: రోహిత్ ధనా ధన్ బ్యాటింగ్..కివీస్ విజయలక్ష్యం 180

IND vs NZ 3rd T20: రోహిత్ ధనా ధన్ బ్యాటింగ్..కివీస్ విజయలక్ష్యం 180
x
Highlights

ఐదు మ్యాచ్ ల టీ 20 సిరిస్ లో భాగంగా మూడో మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ జట్లు ఈరోజు తలబడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో...

ఐదు మ్యాచ్ ల టీ 20 సిరిస్ లో భాగంగా మూడో మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ జట్లు ఈరోజు తలబడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. హమిల్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు శుభారంభం లభించింది. మొదటి రెండు మ్యాచ్ లలో తక్కువ స్కోర్ కే పరిమితమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో తనదైన శైలిలో విజ్రుమ్భించాడు. 40 బంతుల్లో 65 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అంతర్జాతీయ ఫార్మేట్లలో ఓపెనర్గా పదివేల పరుగుల మైలు రాయిని దాటాడు. భారత్ బ్యాట్స్మెన్ లలో ఇంతకు ముందు ఈ మార్క్ ను ముగ్గురు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మాత్రమే సాధించారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ ల తరువాత ఈ మార్క్ ను అందుకున్న నాలుగో బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్ సాధించిన వారిలో రోహిత్ 21వ వాడు.

రోహిత్ సూపర్ బ్యాటింగ్ తో.. ధనాధన్ ఆటతీరుతో కేవలం 23 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో విశ్వరూపం చూపించిన హిట్‌మ్యాన్ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 27 పరుగులొచ్చాయి. అలాగే పవర్‌ప్లే ముగిసేసరికి 69/0తో నిలిచింది. ఓవైపు రోహిత్ చెలరేగుతుండగా.. మరో ఎండ్‌లో రాహుల్ యాంకర్ రోల్ పోషించాడు. అయితే కుదురుగా సాగుతున్న ఈ జోడీని కివీస్ ఆల్‌ రౌండర్ కొలిన్ గ్రాండ్‌హోమ్ విడదీశాడు. తొమ్మిదో ఓవర్ ఆఖరు బంతికి రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 89 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తరువాత కోహ్లీ 38 పరుగులు చేయడంతో ౫ వికెట్ల నష్టపోయి 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది.

అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడ జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేన్ ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. అయితే కివీస్ మాత్రం ఒక మార్పు చేసింది. బ్లైర్ టిక్నెర్ స్థానంలో స్కాట్ కుగెలైన్‌ను జట్టులోకి తీసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories