రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం

IND vs NZ: టీమిండియా మరో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 21 Jan 2023 6:36 PM IST
India Beats New Zealand by 8 wickets in 2nd ODI
X

రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం

IND vs NZ: టీమిండియా మరో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా సిరీస్‌ను సాధించింది. 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.1 ఓవర్లతో టార్గెట్‌ను చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శుభ్‌మన్ గిల్ 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ 36 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో షమి 3, హార్దిక్ పాండ్య 2, వాషింగ్టన్ సుందర్ 2, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story