SA vs IND: మూడో టీ20లో భారత్‌ ఘనవిజయం

SA vs IND: 106 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై సూర్య సేన గెలుపు

Jyothi
Updated on: 15 Dec 2023 7:46 AM IST
India Beat South Africa In Third T20
X

SA vs IND: మూడో టీ20లో భారత్‌ ఘనవిజయం

SA vs IND: జొహెన్నస్‌బర్గ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్‌ ఘనవిజయం సాధించింది. 106 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై సూర్య సేన విజయ ఢంకా మోగించింది. స్కై విధ్వంసకర బ్యాటింగ్‌.. కుల్దీప్‌ మాయాజాలం.. భారత్‌ను విజయ తీరానికి చేర్చింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్‌ చేసింది.

ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 60 పరుగులు చేయగా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌.. విధ్వంసకర బ్యాటింగ్‌తో 55 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో.. భారత్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్లింది. అనంతరం.. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కుల్దీప్‌ మాయాజాలంతో 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. కుల్దీప్‌ 5 వికెట్లు తీసుకోగా.. జడేజా 2, అర్షదీప్‌, ముకేశ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Jyothi

Jyothi

Next Story