Common Wealth Games 2022: పాకిస్తాన్ ను కుమ్మేసిన టీమిండియా..

Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా నిర్వహిస్తున్న కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియా మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది.

Arun Chilukuri
Published on: 31 July 2022 7:22 PM IST
India B𝐞𝐚𝐭 Pakistan by 8 Wickets in Commonwealth Games
X

Common Wealth Games 2022: పాకిస్తాన్ ను కుమ్మేసిన టీమిండియా..

Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా నిర్వహిస్తున్న కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియా మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల టీ20లో దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత 99 పరుగులకే పాక్‌ను కట్టడి చేసిన భారత్‌.. లక్ష్య ఛేదనలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడేసింది. కేవలం రెండు వికెట్లను మాత్రమే నష్టపోయి 11.4 ఓవర్లలో 102 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ స్మృతీ మంధాన (63*) హాఫ్‌ సెంచరీ సాధించి కీలక పాత్ర పోషించింది. షఫాలీ వర్మ 16, సబ్బినేని మేఘన 14, రోడ్రిగ్స్‌ 2* పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో టుబా హస్సన్‌, సోహైల్‌ చెరో వికెట్ తీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story