logo
క్రీడలు

రెండో టీ20లోనూ భారత్ ఓటమి

India also lost in the second T20
X

రెండో టీ20లోనూ భారత్ ఓటమి

Highlights

IND Vs SA 2nd T20 : *భారత్ 6వికెట్లకు 148 పరుగులు

IND Vs SA 2nd T20 : దక్షిణాఫ్రికాతో రెండో టీ20లోనూ టీమిండియాకు ఓటమి పాలైంది. కటక్ లో జరిగిన ఈ మ్యాచ్ లో అన్ని రంగాల్లో రాణించిన సఫారీలు 4 వికెట్లతో విజయం సాధించారు. రెగ్యులర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన క్లాసెన్ కేవలం 46 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టును గెలుపు ముంగిట నిలిపాడు. క్లాసెన్ స్కోరులో 7 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి. అంతకుముందు కెప్టెన్ టెంబా బవుమా 35 పరుగులు చేయగా, చివర్లో డేవిడ్ మిల్లర్ 20 పరుగులు చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, చహల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జూన్ 14న విశాఖపట్నంలో జరగనుంది.

Web TitleIndia also lost in the second T20
Next Story