ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్ : 9 ఓవర్లకు 2 వికెట్లకు 54 పరుగులు

న్యూజిలాండ్ తో జరుగుతున్నా మొదటి వన్డేలో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది.

K V D Varma
Updated on: 5 Feb 2020 11:50 AM IST
ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్ : 9 ఓవర్లకు 2 వికెట్లకు 54 పరుగులు
X

న్యూజిలాండ్ తో జరుగుతున్నా మొదటి వన్డేలో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ఓ బౌలర్ సౌథీ ఒకే ఓవర్లో ఒపెనర్లిద్దర్నీ పెవిలియన్ పంపించాడు. జాగ్రత్తగా ఆడిన ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేసేలా కనిపించారు. అయితే, జట్టు స్కోరు 50 పరుగులు దాటినా తరువాత 9 వ ఓవర్లో ఒక్కసారిగా సౌథీ విరుచుకుపడ్డాడు. దీంతో తొలుత పృధ్వీ షా 20 పరుగులు చేసి సౌథీ ఔలింగ్ లో అవుటయ్యాడు. తరువాత అగర్వాల్ కూడా భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. దీంతో భారత్ జట్టు 54 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయినత్తయింది. ఇక క్రీజులో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ వచ్చారు.

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్ డే మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్.. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం అయ్యాడు. టీ20 సిరీస్ ని 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఆత్మవిశ్వాసం తో ఉన్న టీం ఇండియా వన్డే సిరీస్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.


Live Updates

  • 5 Feb 2020 8:36 AM IST

    న్యూజిలాండ్ తో మొదటి వన్డే : 14 ఓవర్లు - టీమిండియా : 69 / 2 

K V D Varma

K V D Varma

Next Story