IND vs NZ: కడుపుబ్బా నవ్వించే భారత్ న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ ట్రోల్స్
న్యూజిలాండ్ మీద టీమిండియా ఆదివారం జరిగిన మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 5-0 తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాచ్ జరిగిన సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాల పై ఆటగాళ్ళ ఆట తీరుపై సోషల్ మీడియాలో విపరేతంగా ట్రోలింగ్ జరిగింది. మ్యాచ్ ప్రారం భం అయినప్పటినుంచి చివరి వరకూ రెండు జట్లలోని బ్యాట్స్ మెన్ బౌలర్ ఫీల్డర్ ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా తెలుగు సినిమాల్లోని కామెడీ బిట్లను ఆధారం చేసుకుని విపరీతమైన ట్రోలింగ్ చేశారు.
- ఇండియా టాస్ గెలిచిన వెంటనే..నేనే అంబానీ సినిమాలో బిట్ ను వాడేశారు.
- కెఎల్ రాహుల్ 45 పరుగులు చేసిన వెంటనే.. రిశాబ్ పంత్ విపరీతంగా బాధ పడిపోతున్నట్టుగా పెళ్లిచూపులు సినిమాలోని బిట్ ను వాడి వినోదించారు.
- రోహిత్ శర్మ కివీస్ బౌలర్లపై విరుచుకు పడుతుంటే ఆ సందర్భాన్ని ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవరూ వాడలేరు అనే డైలాగ్ సీన్ ని చూపిస్తూ ఎంజాయ్ చేశారు.
- కివీస్ బౌలర్ సౌతీని భారత్ బ్యాట్స్ మెన్ చితకబాదేస్తుంటే.. దానిని చూపించడానికి పటాస్ సినిమాలో ఎమ్మెస్ ను పోలీసులు చితక్కోట్టేస్తున్న సన్నివేశంతో పోలుస్తూ ఆడేసుకున్నారు.
ఇలా ప్రతి అవకాశాన్నీ వదలకుండా వాడేశారు ట్రోలర్స్. వీటన్నిటినీ ఒక్కచోటికీ చేర్చి ట్రోలర్స్ అద్దా ఒక వీడియో రూపొందించింది. ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. కడుపుబ్బా నవ్విస్తున్న ఆ వీడియో చూస్తె ట్రోలర్స్ క్రియేటివిటీకి మీరూ చప్పట్లు కొట్టేస్తారు. మరి మీకోసం ట్రోలర్స్ అడ్డ రూపొందించిన ఈ నవ్వుల వీడియో..




