IND vs ENG 5th Test: టీమిండియా ఘోర పరాజయం.. చితక్కొట్టిన బెయిర్‌స్టో, రూట్

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది.

Arun Chilukuri
Published on: 5 July 2022 5:12 PM IST
IND vs ENG 5th Test England Have Defeated India by Seven Wickets
X

IND vs ENG 5th Test: టీమిండియా ఘోర పరాజయం.. చితక్కొట్టిన బెయిర్‌స్టో, రూట్ 

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్ స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్, బెయిర్ స్టో దంచి కొట్టారు. ఎడాపెడా బౌండరీలతో ఇద్దరూ చెలరేగడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో ఇంగ్లాండ్‌ ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో ఉండగా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి చారిత్రక సిరీస్‌ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, రూట్‌, బెయిర్‌స్టో టీమ్‌ఇండియా ఆశలపై నీళ్లు పోశారు.

స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ : 416

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ :284

భారత్ రెండో ఇన్నింగ్స్: 245

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378

Arun Chilukuri

Arun Chilukuri

Next Story