రోహిత్ జోరుకు బంగ్లా బేజారు!

రోహిత్ జోరుకు బంగ్లా బేజారు!
x
Rohit Shrama Super Batting
Highlights

బౌలర్లను ఉతికి ఆరేయడం అంటే ఇదే.. బాల్ ఎలా వచ్చిందన్నది కాదు ముఖ్యం బౌండరీ దాటించామా లేదా అనేదే పాయింట్ అన్నట్టు రోహిత్ రెచ్చిపోయాడు.

బంగ్లాదేశ్ బౌలర్లకు తన బ్యాటింగ్ రుచి చూపించాడు రోహిత్. టీ 20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లో అనూహ్యంగా పరాజయం పాలైన భారత జట్టు ధిల్లీ లో జరిగిన రెండో మ్యాచ్ లో అందుకు చక్కని సమాధానం ఇచ్చింది. ఆదివారం రాత్రి రాజ్ కోట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం తొ బంగ్లా బౌలర్లు కాకా వికలయ్యారు. ఎక్కడ బంతి వేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు. 43 బంతుల్లోనే ఆరు సిక్స్ లతో 85 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ లో రెండో మ్యాచ్ ని 8 వికెట్ల తేడాతో గెలుచుకుని సిరీస్ సమానం చేసింది భారత్.

టాస్ గెలిచి బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ అప్పచెప్పాడు రోహిత్. దీంతో బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్లు మహ్మద్ నయిమ్ (36: 31 బంతుల్లో), లిట్టన్ దాస్ (29: 21 , కెప్టెన్ మహ్మదుల్లా (30: 21) స్కోరు చేయగా, భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు, దీపక్ చాహర్, ఖలీల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.

154 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు ఓపెనర్ శిఖర్ ధావన్ (31: 27 బంతుల్లో) కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ బంగ్లాదేశ్ బౌలర్లని ఉతికారేశాడు. పవర్ ప్లే నుంచే స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా రోహిత్ శర్మ భారీ షాట్లు ఆడటంతో మైదానంలోని బంగ్లాదేశ్ ఫీల్డర్లు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. స్పిన్నర్ హుస్సేన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ వరుసగా 6, 6, 6 బాది బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. జట్టు స్కోరు 125 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో రోహిత్ ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (24 నాటౌట్: 13 బంతుల్లో ), కేఎల్ రాహుల్ (8 నాటౌట్: 11 బంతుల్లో) 5.4 ఓవర్లలోనే 154/2తో లక్ష్యాన్ని పూర్తి చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories