Sreesanth: శ్రీశాంత్‌పై ముగిసిన బీసీసీఐ నిషేధం

Sreesanth: టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. శ్రీశాంత్‌పై విధించిన ఏడేళ్ల నిషేధం ఆదివారంతో ముగిసింది. ఐపీఎల్ 2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో కేరళకు స్టార్ పేసర్ శ్రీశాంత్‌పై తొలుత బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది.

Karampoori Rajesh
Published on: 13 Sept 2020 7:40 PM IST
Sreesanth: శ్రీశాంత్‌పై ముగిసిన బీసీసీఐ నిషేధం
X

Sreesanth's Spot-Fixing Ban Ends

Sreesanth: టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. శ్రీశాంత్‌పై విధించిన ఏడేళ్ల నిషేధం ఆదివారంతో ముగిసింది. ఐపీఎల్ 2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో కేరళకు స్టార్ పేసర్ శ్రీశాంత్‌పై తొలుత బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే.. శ్రీశాంత్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు సాక్ష్యాధారాల్ని కోర్టు ముందు ఉంచడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. అయితే బుకీలు సంప్రదించడం ఒక్కటే చేసిన తప్పుగా పరిగణించింది, దాంతో.. కోర్టు అతడ్ని నిర్దోషిగా ప్రకటించగా.. బీసీసీఐ మాత్రం ఆ నిషేధాన్ని ఎత్తివేయలేదు. అయితే.. సుప్రీంకోర్టుని శ్రీశాంత్ ఆశ్రయించగా.. ఆ నిషేధాన్ని ఏడేళ్లకి అత్యుత్తమ న్యాయస్థానం కుదించింది.

తొలి టీ20 వరల్డ్ కప్ 2007 లో భారత్ విజయం సాధించడంలో శ్రీశాంత్ సైతం కీలకపాత్ర పోషించాడు. కానీ ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్ నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న తరుణంలో నిషేధకాలాన్ని పూర్తి చేసుకున్నాడు. శ్రీశాంత్‌కు ఏదైనా అవకాశం ఇస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. పేసర్ శ్రీశాంత్ ఇంకా ఫిట్‌గా ఉండి, రేసులో ఉన్నాడని భావిస్తే ఏదైనా ఫ్రాంచైజీ నుంచి అతడికి పిలుపు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ సంద‌ర్భంలో శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ ''నాకు స్వేచ్ఛ లభించింది. మళ్లీ నేను మ్యాచ్‌లు ఆడేందుకు అవ‌కాశం ల‌భించింది. వ్యక్తిగతంగా నాకు ఇది గొప్ప ఉపశమనం'' అని చెప్పుకొచ్చాడు. కేరళకి చెందిన శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఐపీఎల్‌లోనూ 44 మ్యాచ్‌లాడాడు. శ్రీశాంత్‌పై తాజాగా నిషేధం ముగియడంతో.. అతను తొలుత రంజీల్లో కేరళ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత దేశవాళీలోనూ రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడినా.. 37 ఏళ్ల శ్రీశాంత్ మళ్లీ టీమిండియాకి ఆడటం అనుమానమే..!

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story