ICC ODI Rankings: భారత్ ను అధిగమించిన పాక్.. టాప్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా..

ICC ODI Rankings: India Lose 2nd Spot to Pakistan
x

ICC ODI Rankings: భారత్ ను అధిగమించిన పాక్.. టాప్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా..

Highlights

ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా మెన్స్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది.

ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా మెన్స్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్ వార్షిక అప్ డేట్ ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో అస్ట్రేలియా నం.1 స్థానాన్ని ఆక్రమించుకుంది. భారత్ ను వెనక్కినెట్టి పాక్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. పాక్ 116 పాయింట్లతో నం.2 పొజిషన్ లో ఉంటే భారత్ 115 పాయింట్లతో 3RD పొజిషన్ లో నిలిచింది. ఇక అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు 118 పాయింట్లు లభించాయి.

ఏప్రిల్ లో న్యూజిలాండ్ తో పాకిస్థాన్ జట్టు 5 వన్డేల సిరీస్ ఆడింది. ఈ సిరీస్ లో పాక్ 4 మ్యాచులు నెగ్గింది. మరోవైపు భారత్ ఐపీఎల్ కే పరిమితం కావడంతో పాక్ కు కలిసివచ్చింది. మొత్తానికి ఆస్ట్రేలియా, పాక్, భారత్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలవగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్ వరుసగా ఉన్నాయి. ఇక టీ20 ర్యాంకింగ్స్ లో, టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ నం.1గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories