ICC Men's T20 World Cup 2020 postponed: వచ్చే ఏడాదికి టీ20 ప్రపంచకప్‌ వాయిదా!

ICC Mens T20 World Cup 2020 postponed: వచ్చే ఏడాదికి టీ20 ప్రపంచకప్‌ వాయిదా!
x
ICC Men's T20 World Cup 2020 postponed
Highlights

ICC Men's T20 World Cup 2020 postponed: కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అనుకున్నట్టుగానే ఈ ఏడాది టీ20 పురుషుల ప్రపంచకప్‌ వాయిదా పడింది

ICC Men's T20 World Cup 2020 postponed: కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అనుకున్నట్టుగానే ఈ ఏడాది టీ20 పురుషుల ప్రపంచకప్‌ వాయిదా పడింది.. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ లో జరగాల్సిన ఈ ప్రపంచ కప్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లుగా ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే పురుషులకు సంబంధించి వరుసగా వచ్చే మూడేళ్లు మూడు మెగాటోర్నీలు ఉంటాయని ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా వాటికి సంబంధించిన షెడ్యూల్ లను కూడా విడుదల చేసింది..

టీ20 ప్రపంచకప్‌-2021 అక్టోబర్‌-నవంబర్‌లో జరుగుతుందని, దీనికి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14 న జరగనున్నట్లుగా వెల్లడించింది. ఇక టీ20 ప్రపంచకప్‌-2022 కూడా అక్టోబర్‌-నవంబర్‌లోనే ఉండనుందని, దీనికి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ నవంబర్‌ 13న జరగనుందని స్పష్టం చేసింది. ఇక టీ20 ప్రపంచకప్‌-2023 అక్టోబర్‌-నవంబర్‌లో ఉండనుందని, దీనికి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ నవంబర్‌ 26న జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. దీనికి 2023 టీ 20 ప్రపంచ కప్ కి భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఇక అటు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే 2021లో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచకప్ న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతుందని స్పష్టం చేసింది.

ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ వాయిదా పడడంతో ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌-2020 కి ఎక్కువ రోజుల సమయం దొరికుతుంది. దీనిని ముంబయిలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఒకవేళ అక్కడ పరిస్థితులు మెరగవ్వకపోతే ఐపీఎల్‌ ను దుబాయ్‌కి తరలిస్తారని తెలుస్తోంది. అటు యూఏఈలో టోర్నీ జరగడం ఖాయమని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఇక ఐపీఎల్‌ 2020 జరగకుండా ఈ ఏడాది ముగియదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories