నేను అంపైర్లకు ఏమీ చెప్పలేదు..ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌

నేను అంపైర్లకు ఏమీ చెప్పలేదు..ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌
x
Highlights

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తన ప్రమేయం లేకుండానే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చరిత్రలో నిలిచిపోయిన సంఘటన గుర్తుంది కదా. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో...

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తన ప్రమేయం లేకుండానే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చరిత్రలో నిలిచిపోయిన సంఘటన గుర్తుంది కదా. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో న్యూజిలాండ్ ఫీల్డర్ గఫ్టిల్ బౌండరీ లైన్ వద్ద నుంచి విసిరిన బాల్ బెన్‌ స్టోక్స్‌ బ్యాట్ కి తగిలి బౌండరీ దాటి పోయింది. దీంతో ఆ బాల్ కు ఆరు రన్ లు అంపైర్ ఇచ్చాడు. ఈ ఒక్క బాల్ గెలుపు బాటలో ఉన్న న్యూజిలాండ్ ఓడిపోవడానికి కారణంగా మిగిలింది. అయితే, ఈ సందర్భంగా బెన్‌ స్టోక్స్‌ అంపైర్లకు అదనపు పరుగులు అవసరం లేదని చెప్పాడని వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై బెన్‌ స్టోక్స్‌ స్పందిచాడు.

తాను అలా అంపైర్లను కోరలేదని స్పష్టం చేశాడు. ఆ సంఘటనలో నా ప్రమేయం ఏమీ లేదని మాత్రమే నేను చెప్పనన్నాడు. అయితే, తాను న్యూజిలాండ్ బౌలర్ టామ్‌ లాథమ్‌ వద్దకు వెళ్లి క్షమాపణ కోరనన్నాడు. అంతేకాకుండా న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ ను కూడా క్షమాపణలు కోరినట్టు చెప్పాడు. దీంతో ఇప్పటివరకూ ఈ విషయంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలు అన్నీ కల్పితాలని వెల్లడైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories