నోరు జారిన ఖురేషి..స‌చిన్ ఫ్యాన్స్ ట్రోల్స్..అలా అనలేదంటూ క‌వ‌రింగ్

Huma Qureshi: సెల‌బ్రిటీ స్టేట‌స్ అనుభ‌విస్తున్న‌ప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి.

Samba Siva Rao
Published on: 18 May 2021 6:06 PM IST
Sachin Fans Trolls Qureshi
X

హూమా ఖురేషి, సచిన్ టెండూల్కర్ 

Huma Qureshi: సెల‌బ్రిటీ స్టేట‌స్ అనుభ‌విస్తున్న‌ప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి. లేదంటే స‌మాజంలో న‌వ్వుల పాల‌వుతాం అని గ్ర‌హించాలి. పొర‌పాటున మాట జారితే విలువ పోతుంద‌ని గ్ర‌హించాలి. సెల‌బ్రిటీలు ఏది మాట్లాడినా..సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టిన చాలా జాగ్ర‌త్తగా ఉండాలి. ఏ చిన్న తప్పు దొర్లినా కూడా వారిని ట్రోల్ చేసేందుకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ హూమా ఖురేషి కూడా ఒక ఇంటర్వ్యూలో నోరు జారింది. ఆ తర్వాత కవర్ చేయలేక అల్ల‌డిపోతుంది.

ఇంత‌కి ఈ భామ ఏం మాట్లాడిందంటే.. క్రికెట్ అభిమానులు దేవుడిగా భావించే స‌చిన్ టెండూల్కర్ ఫోటో కామెంట్ చేసింది. ఓ ఇంట‌ర్వూలో మాట్లాడిన హూమా హోస్ట్ లు అడిగిన ఒక ప్రశ్నకు ఈమె సచిన్ టెండూల్కర్ పోస్టర్ ను చింపేశానంటూ చెప్పుకొచ్చింది. దీంతో స‌చిన్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్స్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత కవర్ చేసేందుకు చిన్నతనంలో తెలియక చింపాను అంటూ చెప్పుకొచ్చింది. చిన్న తనంలో సోదరుడితో గొడవ పడ్డ సమయంలో కోపంలో తెలియక సచిన్ టెండూల్కర్ పోస్టర్ లను చింపి పడేశానంటూ హూమా ఖురేషి పేర్కొంది. కాని హూమా పోస్టర్ చించింది చిన్నతనంలో కాదని ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అర్థ‌మ‌వుతుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story