Gautam Gambhir Says Ms Dhoni Was A 'Lucky' Captain: ధోనీ సక్సెస్‌కు కారణం ఎవరంటే.. గంభీర్ ఆసక్తికరమైన వాఖ్యలు!

Gautam Gambhir Says Ms Dhoni Was A Lucky Captain:  ధోనీ సక్సెస్‌కు కారణం ఎవరంటే.. గంభీర్ ఆసక్తికరమైన వాఖ్యలు!
x
Gautam Gambhir Says Ms Dhoni Was A 'Lucky' Captain
Highlights

Gautam Gambhir Says Ms Dhoni Was A 'Lucky' Captain: టెస్టుల్లో ఇండియన్ మాజీ కెప్టెన్ ధోని సక్సెస్ కి కారణం మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ అంటూ ఆసక్తికరమైన వాఖ్యలు చేశాడు బీజేపీ ఎంపీ, ఇండియన్ టీం మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌.

Gautam Gambhir Says Ms Dhoni Was A 'Lucky' Captain: టెస్టుల్లో ఇండియన్ మాజీ కెప్టెన్ ధోని సక్సెస్ కి కారణం మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ అంటూ ఆసక్తికరమైన వాఖ్యలు చేశాడు బీజేపీ ఎంపీ, ఇండియన్ టీం మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌.. తాజాగా క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో మాట్లాడిన గంభీర్‌ ఈ వాఖ్యలు చేశాడు. జహీర్‌ఖాన్‌ జట్టులో అత్యుత్తమైన బౌలర్ అని కొనియాడాడు గంభీర్.. అయితే జహీర్ ఖాన్ ని జట్టులోకి తీసుకువచ్చిన ఘనత మాత్రం మాజీ ఆటగాడు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీకి దక్కుతుందని గంభీట్ పరోక్షంగా అభిప్రాయ పడ్డాడు.

ధోని చాలా అదృష్టవంతమైన కెప్టెన్ అని అన్నాడు గంభీర్.. ఎందుకంటే ప్రతీ ఫార్మాట్‌లో తనకు అత్యుత్తమ జట్టే దొరికిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 2011లో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ జట్టును ముందుకు నడిపించడం అనేది ధోనికి చాలా తెలికైందని అన్నాడు. ఎందుకంటే ఆ టోర్నీకి జట్టులో సచిన్‌, సెహ్వాగ్‌తో పాటు, నేనూ, కోహ్లీ, యువరాజ్‌, యూసుఫ్‌ పఠాన్‌ లాంటి మేటి ఆటగాళ్లు ఉన్నామని, అలా ధోనీకి అద్భుతమైన జట్టు దొరికిందని అన్నాడు. అయితే అలాంటి ఆటగాళ్ళను తీసుకురాడంలో గంగూలీ ఎంతో కష్టపడ్డాడని గంభీర్ చెప్పుకొచ్చాడు. అలా ధోని చాలా టోర్నీలను సాధించాడని అన్నాడు.

ఇక గంభీర్ విషయానికి వచ్చేసరికి భారత్ జట్టు, 2007, 2011లో ప్రపంచకప్‌ల గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలలో అత్యధిక పరుగులు చేశాడు గంభీర్ ..

ధోని రీఎంట్రీ పై ఆసక్తి :

ఇక ఇటు ధోని విషయానికి వచ్చేసరికి గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ తర్వాత ధోని మళ్ళీ జట్టులోకి వచ్చింది లేదు. మళ్ళీ ఈ ఏడాది జరబోయే IPL లో మంచి ప్రదర్శనను కనబరిచి జట్టులోకి వద్దామని ధోని భావించాడు కానీ కరోనా నేపధ్యంలో IPL వాయిదా పడింది. మళ్ళీ జట్టులోకి ధోని పునరాగమనం ప్రశ్నార్ధకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories