Anaya Bangar: ఏమి ట్విస్ట్ ఇది! మాజీ క్రికెటర్ కొడుకు ఇప్పుడు కోడలు కాబోతున్నాడు!

Former India All-Rounders Daughter Formerly a Son Gets Marriage Proposal After Transition
x

Anaya Bangar: ఏమి ట్విస్ట్ ఇది! మాజీ క్రికెటర్ కొడుకు ఇప్పుడు కోడలు కాబోతున్నాడు!

Highlights

Anaya Bangar: సంజయ్ బంగర్ గురించి కొత్తగా చెప్పేదేముంది? టీమిండియాకు మాజీ ఆల్‌రౌండర్.

Anaya Bangar: సంజయ్ బంగర్ గురించి కొత్తగా చెప్పేదేముంది? టీమిండియాకు మాజీ ఆల్‌రౌండర్. ఆర్సీబీకి, టీమిండియాకు కోచింగ్‌ కూడా ఇచ్చాడు. విరాట్ కోహ్లీ అయితే అతడిని చాలా నమ్ముతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు బంగరే అతనికి సాయం చేశాడు. ఇప్పుడు సంజయ్ బంగర్ కూతురు అనయా వల్ల వార్తల్లో నిలిచాడు. అసలు విషయం ఏంటంటే.. అనయా బంగర్ గత ఏడాది వరకు అబ్బాయి. తను లింగ మార్పిడి చేయించుకుని ఆర్యన్ నుంచి అనయాగా మారిపోయింది. అనయా తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా షాకింగ్‌గా ఉన్నా.. అది తన ఇష్టం. తను తన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. చాలా కాలం ఇంగ్లాండ్‌లో ఉన్న తర్వాత అనయా మళ్లీ ఇండియాకు వచ్చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు పెళ్లి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి.

అనయా బంగర్‌కు పెళ్లి ప్రపోజల్

అనయా బంగర్ ఏప్రిల్ 7న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో అనయా సూట్ వేసుకుని చాలా అందంగా కనిపించింది. ఫ్యాన్స్ కూడా ఆమెను తెగ మెచ్చుకున్నారు. ఒక అభిమాని అయితే ఏకంగా అనయా బంగర్‌కు పెళ్లి ప్రపోజల్ పెట్టేశాడు. "నా అమ్మగారి కోడలుగా వస్తావా అనయా?" అని కామెంట్ చేశాడు ఆ వ్యక్తి.

ఢిల్లీకి చేరుకున్న అనయా

అనయా బంగర్ ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన అభిమానులకు, ఫాలోవర్స్‌కు తెలియజేసింది. అనయా బంగర్‌ను ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి ముంబైకి రావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. త్వరలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి ముంబైకి వస్తానని అనయా చెప్పింది. ఈ సీజన్‌లో అనయా ఏ మ్యాచ్ చూడటానికి వస్తుందో చూడాలి. అసలు విషయం ఏంటంటే.. అనయా బంగర్ కూడా ఒకప్పుడు క్రికెటరే. తను ఆల్‌రౌండర్‌గా ఆడింది. ముంబైలో చాలా కాలం క్రికెట్ ఆడిన తర్వాత క్రికెట్ వదిలేసింది. ఇప్పుడు అనయా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories