Brad Hogg: టీ20 ప్రపంచకప్ సెమీస్ కి చేరే నాలుగు జట్లు ఇవే..!!

* టీ20 ప్రపంచకప్ 2021లో సెమీస్ కి చేరేవి నాలుగు జట్లు అవే అంటున్న బ్రాడ్ హాగ్

Sandeep Reddy
Published on: 21 Oct 2021 4:20 PM IST
Former Australia Cricketer Brad Hogg Picks Four Semi Final Contenders Except Australia
X

Brad Hogg: టీ20 ప్రపంచకప్ సెమీస్ కి చేరే నాలుగు జట్లు ఇవే

Brad Hogg: టీ20 ప్రపంచకప్ 2021 మొదలుకావడానికి రెండు రోజుల ముందు నుండే పలువురు మాజీ క్రికెటర్లు ప్రపంచకప్ లో వారి ఫేవరేట్ టీమ్స్ తో పాటు ఆటగాళ్ళను ప్లేయింగ్ లెవెన్ గా ప్రకటిస్తూ.. ఏ జట్టు ప్రపంచకప్ లో రానిస్తుందో అని అంచనాలు వేస్తూ క్రికెట్ అభిమానులకు మరింత ఉత్కంటని రేపుతున్నారు. తాజాగా ఈ లిస్టులో ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ చేరాడు.

టీ20 ప్రపంచకప్ 2021 లో నాలుగు జట్లు సెమీ ఫైనల్ వరకూ చేరుతాయని అంచనా వేశాడు. ప్రస్తుతం గ్రూప్ - ఏ లో ఉన్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండిస్, దక్షిణాఫ్రికాలలో ఇంగ్లాండ్, వెస్టిండిస్ జట్లు.. గ్రూప్ - బి లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లలో ఇండియా, పాకిస్తాన్ జట్లు సెమీ ఫైనల్ చేరుతాయని బాడ్ హాగ్ జోస్యం చెప్పాడు.

అయితే తన దేశపు జట్టు ఆస్ట్రేలియా మాత్రం సెమీస్ కి వెళ్తుందని నమ్మకం లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు బ్రాడ్ హాగ్. టీ20 ప్రపంచకప్ 2021 గ్రూప్-ఏ లో ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ - వెస్టిండిస్ మధ్య అక్టోబర్ 23న మ్యాచ్ లు జరగనుండగా, అక్టోబర్ 24న భారత్ - పాక్ మ్యాచ్ తో గ్రూప్ - బి మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story