FIFA Women's World Cup 2023: ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ !

FIFA Womens World Cup 2023: ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ !
x
Highlights

FIFA Women's World Cup 2023: మహిళల ఫుట్‌బాల్‌ ఫిఫా 2023లో ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

FIFA Women's World Cup 2023: మహిళల ఫుట్‌బాల్‌ ఫిఫా 2023లో ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ కు ఆతిథ్యం ఇచ్చేందుకు కొలంబియా కూడా బిడ్ దాఖలు చేసింది. అయితే ఆతిథ్య హక్కుల కోసం గురువారం ఫిఫా కౌన్సిల్‌లో జరిగిన ఓటింగ్‌లో ఈ ఆసీస్, కివీస్‌లు దేశాలు కొలంబియాను 22-13 తేడాతో ఓడించాయి.

ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో మాట్లాడుతూ.. 2023 ప్రపంచ కప్ న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాలు

గురువారం ప్రకటించారు. రెండు దేశాల్లో కలిపి మొత్తం 12 నగరాల్లోని 13 స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచకప్‌ మ్యాచ్‌లు 2023, జూలై 10 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

అయితే 2023లో జరగనున్న ప్రపంచకప్‌లో 32 జట్లు పాల్గొంటాయి.2019లో ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో 24 జట్లు తలపడ్డాయి. ఈ సారి మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. ఇక మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు సంబందించిన క్వాలిఫయింగ్‌ మ్యాచులు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను అమెరికా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు గెలుపొందింది. గత రెండు ప్రపంచకప్‌లలో (2019, 2015) అమెరికా విజయం సాధించింది.

ఈ ఏడాది నవంబరు 2 నుంచి 21 వరకు భారత్‌లో అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ టోర్నీ జరగాల్సింది. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు టోర్నీని నిర్వహించనున్నారు. మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories