ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీమిండియా ఆసీస్ సిరీస్ క్యాన్సిలేనా?

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీమిండియా ఆసీస్ సిరీస్ క్యాన్సిలేనా?
x
Highlights

కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలైయ్యాయి. క్రీడా రంగం కూడా అతలాకుతలం అయిపోయింది.

కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలైయ్యాయి. క్రీడా రంగం కూడా అతలాకుతలం అయిపోయింది. ఐపీఎల్ వాయిదా పడటం కాకుండా అన్ని క్రికెట్ మ్యాచ్ లు తాత్కాలికంగా రద్దయ్యాయి. ఒలింపిక్స్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా సరిహద్దులను 6 నెలల పాటు మూసివేయాలనే నిర్ణయానికి రావడంతో పలు కీలక టోర్నీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాగా.. టీ20 ప్రపంచకప్‌ తోపాటు టీమిండియా ఆసీస్ టూర్‌ సందిగ్ధత నెలకొంది. అక్టోబర్ లో జరిగే టీ20 ట్రై సిరీస్‌తో మొదలయ్యే టీమిండియా ఆసీస్ పర్యటన.. డిసెంబర్‌లో టెస్ట్ సిరీస్‌తో ముగుస్తుంది. ఈ మధ్యలో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18న టీ20 వరల్డ్‌కప్ మొదలవుతుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో రెండు వేలకు పైగా కోవిద్ పాజిటివ్ కేసులు ఉండగా.. 16 మంది ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు విడిచారు. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ సరిహద్దులు మూసి వేసింది. ప్రతిష్ఠాత్మక లీగ్ ఐపీఎల్ విషయంలో షాక్ తిన్న బీసీసీఐకి ఇప్పుడిదో ఆసీస్ టూర్ కొత్త సమస్యగా ఏర్పడింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వలన ఏ అంతర్జాతీయ క్రికెట్ జట్టు కూడా ఆ దేశంలో అడుగుపెట్టలేని పరిస్థితి.

టీ20 ప్రపంచ కప్ సహా అన్ని సిరీస్‌లను ప్రభావితం చేయనుంది. అయితే కరోనా విషయంలో పరిస్థితులు అదుపులోకి వస్తే ఆరు నెలల నిషేధాన్ని ఎత్తివేస్తారని, అందువల్ల కంగారు అవసరం లేదని బీసీసీఐ అధికారి తెలిపారు. ఒకవేళ అంతర్జాతీయ ప్రయాణాలు బ్య 6 నెలలపాటు నిషేదం కొనసాగితే మాత్రం లాజిస్టికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని బోర్డుకు చెందిన మరో అధికారి అన్నారు. అంతే కాకుండా వీసాలు,టిక్కెట్ల విషయంలో తలనొప్పులు తప్పవన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories