ధోనీ సరికొత్తగా..

ధోనీ సరికొత్తగా..
x
Highlights

మిస్టర్ కూల్ ధోనీ ఏడిచేసినా సంచలనమే. అది క్రికెట్ అయినా.. ఫ్యాషన్ అయినా..

మిస్టర్ కూల్ ధోనీ ఏడిచేసినా సంచలనమే. అది క్రికెట్ అయినా.. ఫ్యాషన్ అయినా.. ఇటీవలి కాలంలో ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి. వాటికి కామా పెడుతూ సైన్యంలో పనిచేయాలని ఉందంటూ కొన్ని రోజులు కాశ్మీర్ లో కర్తవ్యాన్ని నిర్వహించారు ధోనీ. భారత సైన్యంలో 106 టీఏ పారామిలటరీ బెటాలియన్‌తో కలిసి 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ధోని ఆగస్టు 15న లేహ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తరువాత నుంచి ముంబయిలో పలు వాణిజ్య ప్రకటనల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా అయన ముంబయి ఎయిర్ పోర్టులో కొత్త లుక్ తో కనిపించి సందడి చేశారు. తలకు నలుపు రంగు గుడ్డ కట్టుకుని టీషర్ట్‌ ధరించి చిరునవ్వులు చిందిస్తూ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఫోటోలు తీసిన అభిమానులు వాటిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. వాటికి పెద్ద ఎత్తున లైక్ లు వస్తున్నాయి. ఇక ఆ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories