ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి జైట్లీ పేరు!

ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి జైట్లీ పేరు!
x
Highlights

ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు డీడీసీఏ వచ్చే నెల 12 ప్రత్యెక కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. అంతే కాకుండా ఈ స్టేడియం లోని ఒక స్టాండ్ కు విరాట్ కోహ్లీ పేరు పెట్టబోతున్నారు.

ఢిల్లీ లోని ప్రముఖ క్రికెట్ స్టేడియం ఫిరోజ్ షా కోట్ల పేరు మార్చనున్నారు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్మ్రుతి చిహ్నంగా ఈ స్టేడియంకు అయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నిర్ణయం తీసుకుంది. పేరు మార్చే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే కోట్లాలోని ఓ స్టాండ్‌కు విరాట్ కోహ్లీ పేరు పెట్టనున్నారు.

డీడీసీఏ నిర్ణయంపై అసోసియేషన్ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ, అరుణ్ జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే విరాట్ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రూ, రిషబ్ పంత్ వంటి పలువురు క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలిచారని చెప్పారు. జైట్లీ డీడీసీఏ పగ్గాలు చేపట్టిన సమయంలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియంను పునరుద్ధరించారని, ప్రపంచ స్థాయి డ్రెస్సింగ్ రూమ్‌ల నిర్మాణంతో పాటు ఫ్యాన్ల సంఖ్యను కూడా పెంచారని చెప్పారు. కాగా, పేరు మార్పు సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో హోం మంత్రి అమిత్‌షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, తదితరులు పాల్గోనున్నారు. అయితే, ఈ స్టేడియం కు అరుణ్ జైట్లీ పేరు పెడుతున్నప్పటికీ గ్రౌండ్ ని మాత్రం ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ గానే పిలుస్తారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories