IPL 2020: ముంబాయి బౌల‌ర్ల ధాటికి.. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డ్డ చెన్నై

IPL 2020: ముంబాయి బౌల‌ర్ల ధాటికి..  పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డ్డ చెన్నై
x
Highlights

IPL 2020: ఐపీఎల్-2020లో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియం వేదిక‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ ల మ‌ధ్య పోరు జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబాయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది

IPL 2020: ఐపీఎల్-2020లో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియం వేదిక‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ ల మ‌ధ్య పోరు జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబాయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ వ‌చ్చిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. చెన్నైబ్యాట్ మెన్స్ కి ముంబాయి బౌల‌ర్లు చుక్క‌లు చూపిస్తున్నారు. తొలి ఓవ‌ర్ నుంచే చెన్నై ప‌తానాన్నిశాసిస్తున్నారు. కేవ‌లం 7 ఓవ‌ర్లు ముగిసేటప్ప‌టికే (స్కోరు 30-6 ) కీల‌క‌మైన 6 వికెట్ ప‌డిపోయింది. పీకల లోతు క‌ష్టాల్లోకి ప‌డిపోయింది. బుమ్రా త‌న బంతుల‌తో మ్యాజిక్ చేస్తున్నారు.

బౌల్ట్ బౌలింగ్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎల్బి అయ్యాడు. అంపైర్ ఔటియ్యనప్పటికి ముంబయి సమీక్ష కోరి విజయవంతమయ్యింది. ఆ తరువాత బుమ్రా బౌలింగ్ లో అంబటి రాయుడు పెవిలియన్ చేరాడు. షార్ట్ పిచ్ బంతిని ఆఫ్ సైడ్ జరిగి ఆడబోయిన రాయుడి గ్లోవ్స్ కు తగిలి బంతిని కీపర్ డికాక్ అందుకున్నాడు. తరువాత వెంటనే జగదీశన్ స్లిప్ లో సూర్యకుమార్ యాదవ్ కు దొరికాడు. ధోని, జడేజా బ్యాటింగ్ లోకి వ‌చ్చారు. జ‌ట్టు త‌మ వంతు స‌హాకారం అందిచ‌నున్నారు. అని పిలిచింది. కానీ బౌల్డ్ వేసిన 5 ఓవ‌ర్‌లో భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి.. కృనాల్ పాండ్యాకు దొరికిపోయాడు. అనంత‌రం రాహుల్ చాహార్ వేసిన 7 ఓవ‌ర్ లో ధోనీ తొలి బంతికి భారీ సిక్స్ కొట్టాడు. త‌రువాతి ఓవ‌ర్‌కి భారీ షాక్ కి ప్రయ‌త్నించి, కిప‌ర్ డికాక్ దొరికిపోయాడు. దీంతో చెన్నై డీప్ డీప్ డీప్ ట్ర‌బుల్ లో ప‌డిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories