అభిమానికి చేదు అనుభవం: సెల్ఫీ అడిగితే నో అన్న కోహ్లీ

అభిమానికి చేదు అనుభవం: సెల్ఫీ అడిగితే నో అన్న కోహ్లీ
x
Virat Kohli
Highlights

కరోనా వైరస్ ... ఇప్పుడు ఏ ఇద్దరు కలిసిన దీని గురించే చర్చ... రోజురోజుకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కరోనా వైరస్ ... ఇప్పుడు ఏ ఇద్దరు కలిసిన దీని గురించే చర్చ... రోజురోజుకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే భారత్ లో ఐదు కేసులు నమోదయ్యాయి. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఇక క్రికెట్ లో జరగవలసిన కొన్ని ద్వైపాక్షిక సిరీస్లు రద్దు అయ్యాయి. అందులో భాగంగా భారత్ , దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ రద్దు అయిపోయింది. దీనితో ఆటగాళ్ళు తమ స్వస్థలానికి వెళ్ళిపోతున్నారు..

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఓ మహిళ కోహ్లీతో సెల్ఫీ కోసం ప్రయత్నించగా ఆమెకు చేధు అనుభవం ఎదురైంది. భారీ భద్రత నడుమ కోహ్లీ అలా వెళ్తుండగా... పక్కన నుంచి వచ్చిన ఓ అమ్మాయి సెల్ఫీ కోసం తన సెల్ఫోన్ ఇవ్వబోయింది. కానీ కోహ్లీ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో అమ్మాయి కూడా వెను తిరిగింది.. ఇక ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం వలన అభిమానులతో కరచాలనం, సెల్ఫీలకి దూరంగా ఉండాలని బీసీసీఐ ఆదేశించింది. దీనిని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories