Tokyo Olympics: మహిళల హాకీ కాంస్య పోరులో భారత్‌కు నిరాశ

Tokyo Olympics: 4-3 తేడాతో భారత్‌పై విజయం సాధించిన బ్రిటన్ * రెండో క్వార్టర్‌లో మూడు గోల్స్ చేసిన భారత జట్టు

Sandeep Eggoju
Updated on: 6 Aug 2021 9:25 AM IST
Tokyo Olympics: మహిళల హాకీ కాంస్య పోరులో భారత్‌కు నిరాశ
X

బ్రిటన్ పై ఓడిపోయిన మహిళా హాకీ టీం (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: ఒలింపిక్స్‌ మహిళల హాకీ కాంస్య పోరులో భారత్‌కు నిరాశ ఎదురైంది. మూడో స్థానం కోసం బ్రిటన్‌తో జరిగిన మ్యాచులో 4-3 తేడాతో భారత మహిళల జట్టు పరాజయం చవిచూసింది.

ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన మ్యాచును.. నాలుగో క్వార్టర్ మలుపు తిప్పింది. తొలి క్వార్టర్‌లో రెండు టీమ్‌లు ఒక్క గోల్‌ కూడా సాధించలేదు. రెండో క్వార్టర్ లో బ్రిటన్ రెండు గోల్స్ కొడితే.. ఇండియా మూడు గోల్స్‌తో ఆధిపత్యం ప్రదర్శించింది. 25, 26వ నిమిషంలో గుర్జీత్ కౌర్ రెండు వరుస గోల్స్ చేయగా 29వ నిమిషంలో మూడో గోల్ చేసింది నందనా కటారియా. దీంతో రెండో క్వార్టర్‌లో ఆధిక్యం సంపాదించింది భారత్. అయితే మూడు నాలుగు క్వార్టర్లలో ఒక్క గోల్‌ కూడా సాధించలేకపోయింది భారత్‌. ఈ రెండు క్వార్టర్లలో రెండు గోల్స్ చేసిన బ్రిటన్ 4-3 తేడాతో విజయం సాధించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story