MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌ నుంచి ధోని ఔట్.. కెప్టెన్‌గా ఎవరంటే?

IPL 2023: ఐపీఎల్ 2023 (IPL 2023), ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH) మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Arun Chilukuri
Published on: 21 April 2023 12:35 PM IST
ben-stokes-as-a-captain-for-may-replace-ms-dhoni-place-csk-vs-srh-match-ipl-2023
X

MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌ నుంచి ధోని ఔట్.. కెప్టెన్‌గా ఎవరంటే?

IPL 2023 MS Dhoni: ఐపీఎల్ 2023 (IPL 2023), ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH) మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) గురించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో, ఎంఎస్ ధోని స్థానంలో డాషింగ్ ఆల్ రౌండర్ సీఎస్‌కె కెప్టెన్‌గా అవకాశం పొందవచ్చు.

ధోనీ స్థానంలో కమాండ్ ఎవరికంటే..

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్‌ ధోని (MS Dhoni) ఐపీఎల్ 2023 (IPL 2023)లో మోకాలి గాయంతో నిరంతరం పోరాడుతున్నాడు. మీడియా కథనాల ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎంఎస్ ధోనీకి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని స్థానంలో బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత ముఖ్యమైన ఆటగాళ్ళలో ఒకడు. అతనికి కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది.

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బెన్ స్టోక్స్..

బెన్ స్టోక్స్ కాలి గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌ల్లో జట్టులో చేరలేదు. అయితే ఇప్పుడు అతను ఫిట్‌గా ఉండడంతో పాటు ఎంపికకు అందుబాటులో ఉండడం చెన్నైకి ఊరటనిచ్చే అంశం. బెన్ స్టోక్స్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించాడు. ఇలాంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాడు. బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

CSK జట్టు..

ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, సిసంద మగల, శివమ్ దూబే, డ్వేన్ ప్రిటోరియస్, అహయ్ మండల్, నిశాంత్ సింధు, రాజ్‌వర్ధన్ హంగేర్‌కర్, రాజ్‌వర్ధన్ హంగేల్‌కర్, సుబ్హాన్ హంగేర్‌గేర్ , సిమర్జిత్ సింగ్, మతిసా పతిరనా, మహేష్ తీక్ష్ణ, భగత్ వర్మ, ప్రశాంత్ సోలంకి, షేక్ రషీద్, తుషార్ దేశ్‌పాండే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story