Sourav Ganguly: భారత్‌లోనే ఐపీఎల్ 2022.. కానీ..

IPL 2022: కరోనా నేపథ్యంలో భారత్‌లో ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 3 Feb 2022 6:02 PM IST
Sourav Ganguly says IPL 2022 is likely to be held in India
X

Sourav Ganguly: భారత్‌లోనే ఐపీఎల్ 2022.. కానీ..

IPL 2022: కరోనా నేపథ్యంలో భారత్‌లో ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. రానున్న సీజన్ కూడా విదేశాల్లోనే జరుగుతుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించడం జరిగిందన్న ఆయన ఐపీఎల్‌ -2022 సీజన్‌ మొత్తాన్ని భారత్‌లోనే నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. కరోనా కారణంగా పరిస్థితులు మరింత దారుణంగా తయారైతే తప్ప.. వేదికలను మార్చే ఆలోచన లేదు అని గంగూలీ పేర్కొన్నాడు.

వేదికల విషయంపై గంగూలీ మాట్లాడుతూ... మహారాష్ట్రలోని ముంబై, పుణెలో మ్యాచ్‌లు నిర్వహించాలనే యోచనలో ఉన్నాం. నాకౌట్‌ దశకు త్వరలోనే వేదికను ఖరారు చేస్తాం అని అన్నారు. క్రికెట్‌ చూసేందుకు అభిమానుల్ని అనుమతిస్తారా లేదా అన్న దానిపై బీసీసీఐ ప్రెసిడెంట్ స్పష్టత ఇవ్వలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story