Sourav Ganguly in Home Quarantine : హోం క్వారంటైన్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

Arun Chilukuri
Updated on: 16 July 2020 11:22 AM IST
Sourav Ganguly in Home Quarantine : హోం క్వారంటైన్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
X

BCCI president Sourav Ganguly in Home Quarantine : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అతని సోదరుడు స్నేహాశీష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో గంగూలీతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. బెంగాల్‌ మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ అయిన స్నేహాశీష్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో బెల్లె వ్యూ హాస్పిటల్‌లో చేరారు. గంగూలీ కుటుంబ సభ్యలకు కూడా త్వరలోనే కరోనా పరీక్షలు చేయనున్నారు.

స్నేహాశీష్ నివాసం ఉంటున్న బంగ్లాను స్థానిక అధికారులు శానిటేషన్ నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న సోదరుడికి కరోనా సోకిన నేపథ్యంలో సౌరవ్ గంగూలీ హోం క్వారంటైన్ అయ్యారు. కొవిడ్ -19 నిబంధనల ప్రకారం సౌరవ్ గంగూలీ క్వారంటైన్ లో ఉంటారని బీసీసీఐ అధికారులు చెప్పారు. తన సోదరుడు ప్రతీరోజూ ఫ్యాక్టరీకి వెళ్లడం వల్లనే కరోనా బారిన పడ్డాడని సౌరవ్ గంగూలీ చెప్పారు. ఇటీవల జన్మదినం జరుపుకున్న సౌరవ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story