T20 Worldcup 2021: షూలో డ్రింక్స్ నింపుకొని తాగుతూ ఆసీస్ ఆటగాళ్ళ సంబరాలు

* టీ20 ప్రపంచకప్ లో తొలిసారి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు

Sandeep Reddy
Published on: 15 Nov 2021 12:49 PM IST
Australia Cricket Team T20 Worldcup 2021 Winning Celebrations Video in Social Media
X

T20 Worldcup 2021- Australia: షూలో డ్రింక్స్ నింపుకొని తాగుతూ ఆసీస్ ఆటగాళ్ళ సంబరాలు

T20 Worldcup 2021- Australia: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఘనవిజయం సాధించి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్ ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా ఆసీస్ ఆటగాళ్ళు టీ20 ప్రపంచకప్ గెలిచిన సంతోషంలో డ్రెస్సింగ్ రూమ్ లో విభిన్నంగా సెలెబ్రేషన్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. తమ షూ లలో డ్రింక్స్ నింపుకొని వాటిని తాగుతూ ఎంజాయ్ చేశారు.

మొదట ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తను వేసుకున్న షూని విడిచి అందులో డ్రింక్స్ నింపుకొని తాగగా ఆ తరువాత అల్ రౌండర్ మార్కస్ స్టొయినీస్‌ కూడా అదే పద్దతిలో వేడ్ షూలోనే డ్రింక్స్ నింపి తాగుతూ డ్రెస్సింగ్ రూమ్ లో చిందులేశారు. తాజాగా ఆసీస్ సెలెబ్రేషన్స్ వీడియోని ఐసీసీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఫైనల్ లో గెలిచి ప్రపంచకప్ ని గెలిచిన ఆసీస్ ఆటగాళ్ళ ఆనందానికి అవధుల్లేవు అంటూనే వారి సెలెబ్రేషన్స్ పై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ ని గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలుపగా ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ థ్యాంక్ యూ గ్రేట్ మాన్ అంటూ రిప్లై ఇచ్చాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story