ధోనీకి ఆర్మీ చీఫ్ గ్రీన్ సిగ్నల్!

K V D Varma
Published on: 22 July 2019 7:35 AM IST
ధోనీకి ఆర్మీ చీఫ్ గ్రీన్ సిగ్నల్!
X

తనకు రెండు నెలలపాటు భారత మిలటరీలో సేవ చేయాలని ఉందని చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభ్యర్థనకు ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పచ్చజెండా ఊపారు. పారాచూట్ రెజిమెంట్ బెటాలియన్లో రెండు నెలల పాటు ధోనీ శిక్షణ పొందటానికి లైన్ క్లియర్ అయింది.

కాశ్మీర్ లోయలో ఈ శిక్షణ ఉండవచ్చు. సైనిక కార్యకలాపాల్లో ధోనీ భాగస్వామిగా మారే అవకాశం ఉండకపోయినా..పూర్తి స్థాయిలో శిక్షణ పొందే వీలు ఉన్నట్టు తెలుస్తోంది. వరల్డ్ కప్ అనంతరం ధోనీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే, ధోనీ మాత్రం రెండు నెలలు క్రికెట్ కు సెలవు పెట్టి ఆర్మీలో పని చేయాలని ఉందంటూ చెప్పాడు. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అయిన ధోనీ ఈ విషయంపై ఆర్మీ ఉన్నతాధికారులను అభ్యర్థించాడు. ఇప్పుడు ఆ అభ్యర్థనకు ఆర్మీ చీఫ్ ఓకే చెప్పారు.

K V D Varma

K V D Varma

Next Story