Aakash Chopra: ధోని బ్యాటింగ్ లో జీరో.. కెప్టెన్ గా హీరో..!!

* మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ పై ఆకాష్ చోప్రా సెటైర్లు

Sandeep Reddy
Published on: 1 Oct 2021 5:02 PM IST
Aakash Chopra Sensational Comments on Chennai Super Kings Captain Dhoni
X

ఆకాష్ చోప్రా - ధోని (ఫైల్ ఫోటో)

Aakash Chopra: భారత క్రికెట్ మాజీ ఆటగాడు.. చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 10 మంది ఆటగాళ్ళతో పాటు ఒక కెప్టెన్ తో మాత్రమే ఆడుతుందని.., ధోని వల్ల చెన్నై బ్యాటింగ్ లైనప్ కి ఎలాంటి ఉపయోగం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కేవలం కీపర్ గా, కెప్టెన్ గా మాత్రమే ధోని చెన్నై జట్టుకి సేవలు చేస్తున్నాడని.. ఇప్పటివరకు జరిగిన 11 మ్యాచ్ లలో 11.40 యావరేజ్ తో 66 పరుగులతో పేలవ ప్రదర్శన కనబరిచాడని చెప్పుకొచ్చాడు. అయితే ధోని కెప్టెన్సీ వల్లనే చెన్నై ఘనవిజయాలు సాధించిందని.. కెప్టెన్ గా ధోని ప్రతిభావంతుడని..ఇటీవలే సాహా క్యాచ్ తో ఐపీఎల్ లో 100 క్యాచ్ లను అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడని కామెంట్ చేశాడు.

ప్రస్తుత ఐపీఎల్ లో ధోని కెప్టెన్ గా హీరో అయిన.. బ్యాటింగ్ లో మాత్రం జీరో అన్నట్లుగా.. ఒకవైపు కెప్టెన్ గా, కీపర్ గా ధోని సేవలను ప్రశంసించడమే మరోవైపు ధోని బ్యాటింగ్ గురించి సెటైర్లు వేయడంతో మిస్టర్ కూల్ అభిమానులు హాట్ హాట్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఆకాష్ చోప్రాపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా ట్విట్టర్ వేదికగా ఆకాష్ చోప్రా ఐపీఎల్ 2020లో చెన్నై ప్లేఆఫ్ కి చేరుతుందని అంచనా వేశానని కాని ఆ ఏడాది చెన్నై క్వాలిఫై అవలేదని, కాని ఈ ఏడాది చెన్నై ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవదని చెప్పిన తన విశ్లేషణకు తప్పని నిరూపిస్తూ చెన్నై 18 పాయింట్స్ తో మొదటిస్థానంలో ఉందని.. అయితే ఈ విషయంపై ఆకాష్ ని ట్రోల్ చేస్తున్న చెన్నై అభిమానులకు తన మొదటిసారి నా విశ్లేషణ తప్పు అని తెలిసినపుడు మాట్లాడని అభిమానులు ఇప్పుడు ఎందుకు ఇలా నాది చెత్త విశ్లేషణ అని అంటున్నారో అర్ధం కావట్లేదని ట్వీట్ చేశాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story