తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

4 గంటల్లో శ్రీవారి దర్శనం

K V D Varma
Updated on: 11 Nov 2019 11:38 AM IST
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ
X

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ సోమవారం, స్వామివారి మూలవిరాట్టుకు నిత్య‌కైంకర్యాలు అనంతరం శ్రీదేవిభూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మండపంలో విశేషపూజ అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఇక రద్దీ తక్కువగా ఉండడంతో సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 4 గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులు గంటన్నర, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులు 2 గంటల సమయంలో స్వామివారి దర్శనభాగ్యం పొందుతున్నారు. నిన్నటి రోజు ఆదివారం(10-11-2019) 82,593 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 2.14 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 27,209 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

K V D Varma

K V D Varma

Next Story