శ్రీవారి మెల్ చాట్ వస్త్రాలకు రేపట్నుంచి ఈ వేలం

శ్రీవారి మెల్ చాట్ వస్త్రాలకు రేపట్నుంచి ఈ వేలం
x
Highlights

తిరుమలలో శ్రీవారికి భక్తులు మెల్ చాట్, ఉత్తరీయాలను కానుకగా సమర్పిస్తుంటారు. వీటిని ఇప్పుడు వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ భావిస్తోంది. రేపటి...

తిరుమలలో శ్రీవారికి భక్తులు మెల్ చాట్, ఉత్తరీయాలను కానుకగా సమర్పిస్తుంటారు. వీటిని ఇప్పుడు వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ భావిస్తోంది. రేపటి (మంగళవారం) నుంచి ఈ వస్త్రాలను ఆన్ లైన్ ద్వారా ఈ వేలం ప్రక్రియలో విక్రయానికి ఉంచనున్నారు. ఇదిలా ఉండగా ఈ ఉదయం 5 గంటల సమయానికి తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక, టైమ్ స్లాట్ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం నాడు స్వామివారిని 95,722 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,481 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 2.49 కోట్ల ఆదాయం హుండీలో కానుకల ద్వారా లభించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories