తిరుమలలో భక్తుల రద్దీ సామాన్యం

K V D Varma
Updated on: 1 Aug 2019 4:25 PM IST
తిరుమలలో భక్తుల రద్దీ సామాన్యం
X

ఈ రోజు గురువారం., 01.08.2019 ఉదయం 5 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 02 గదులలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 05 గంటలు పడుతోంది. శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ :300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును. నిన్న బుధవారం 65,715 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కలిగింది. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు 3.62 కోట్లు.

K V D Varma

K V D Varma

Next Story