Zodiac Signs: ఈ 5 రాశులవారికి సంపదకి లోటుండదు.. లక్ష్మీమాత దయ ఎల్లప్పుడు ఉంటుంది..!

Zodiac Signs: ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు పెద్దలు. నేటి కాలంలో ధనమే ప్రపంచాన్ని శాసిస్తుంది.

Arun Chilukuri
Updated on: 29 July 2023 8:00 PM IST
There is No Lack of Wealth for These Five Signs Maa Lakshmi Grace is Always There
X

Zodiac Signs: ఈ 5 రాశులవారికి సంపదకి లోటుండదు.. లక్ష్మీమాత దయ ఎల్లప్పుడు ఉంటుంది..!

Zodiac Signs: ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు పెద్దలు. నేటి కాలంలో ధనమే ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బులు లేకపోతే సమాజంలో గౌరవ, మర్యాదలు ఉండవు. ప్రపంచం డబ్బుతోనే నడుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పురాణాల ప్రకారం లక్ష్మి దేవతని సంపదకి మూలంగా చెబుతారు. ఈ తల్లి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారికి డబ్బుకి లోటు ఉండదు. అయితే ప్రతి ఒక్కరు అమ్మ అనుగ్రహం పొందలేరు. కానీ కొన్ని రాశులవారికి ఎల్లప్పుడు లక్ష్మిమాత అనుగ్రహం ఉంటుంది. ఆ రాశులేంటో ఈరోజు తెలుసుకుందాం.

వృషభ రాశి

శుక్రుడు వృషభ రాశికి అధిపతి. ఈ గ్రహం ఆనందం-సంపదలకి చిహ్నంగా చెబుతారు. ఈ రాశి వారు లక్ష్మి తల్లికి ఎంతో ప్రీతిపాత్రులు. జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. వృషభరాశి వారిపై లక్ష్మీమాత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

సింహ రాశి

సూర్య భగవానుడు సింహ రాశికి అధిపతిగా చెబుతారు. వారి వేగం, ఉత్సాహం, దృఢ సంకల్పం సింహ రాశి ప్రజలపై ఉంటుంది. ఈ రాశివారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి. తమ కష్టార్జితంతో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది.

తులారాశి

తులారాశికి శుక్రుడు అధిపతి. లక్ష్మి ఆశీస్సులతో ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అంగారక గ్రహాన్ని గ్రహాల కమాండర్‌గా పిలుస్తారు. ధైర్యం, శక్తి, బలానికి కారకంగా చెబుతారు. ఈ రాశి వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. ఉద్యోగ-వ్యాపారాలలో విజయాలని సాధిస్తారు.

మీనరాశి

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశిచక్రాలలో మీనం కూడా ఒకటి. ఈ రాశి వారికి ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం ఎదురుకాదు. లక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆమె అనుగ్రహంతో ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉంటుంది. ఈ రాశివారు ఆమెకు ప్రియమైనవారుగా చెబుతారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story