Astro Vastu Tips: రోడ్డుపై డబ్బులు దొరికాయా.. తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Astro Vastu Tips: కొన్నిసార్లు మనం రోడ్డుపై నడిచేటప్పుడు అనుకోకుండా చిల్లర నాణేలు కానీ కరెన్సీ నోట్లు కానీ దొరుకుతాయి.

Arun Chilukuri
Updated on: 4 Sept 2023 9:00 PM IST
Find Out What Happens If You Take Money Found On The Road According To Science
X

Astro Vastu Tips: రోడ్డుపై డబ్బులు దొరికాయా.. తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Astro Vastu Tips: కొన్నిసార్లు మనం రోడ్డుపై నడిచేటప్పుడు అనుకోకుండా చిల్లర నాణేలు కానీ కరెన్సీ నోట్లు కానీ దొరుకుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. దీనివల్ల కొన్నిసార్లు మంచి జరిగితే కొన్నిసార్లు చెడు జరుగుతుంది. హిందూ మతంలో ప్రతి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అదేవిధంగా రహదారిపై డబ్బులు దొరకడం కూడా శుభ, అశుభకరమైన విషయాలను సూచిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రంలో రోడ్డుపై డబ్బు, నాణేలు దొరికితే శుభప్రదంగా చెప్పవచ్చు. ఇది మీరు పూర్వీకుల ఆశీర్వాదం పొందారని సూచిస్తుంది. అలాగే హిందూ మతం ప్రకారం రోడ్డుపై డబ్బులు దొరికితే మీరు చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం. చైనాలో అయితే ఇలాంటి నాణేలని అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉపయోగిస్తారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే దారిలో నాణెం లేదా నోటు దొరికితే ఆ పనిలో విజయం సాధిస్తారని అర్థం.

అలాగే ఏదైనా పని నుంచి తిరిగి వస్తున్నట్లయితే దారిలో డబ్బు పడి ఉంటే మీరు ఆర్థిక ప్రయోజనం పొందబోతున్నారని అర్థం.హిందూ మతం ప్రకారం కొంత డబ్బు రోడ్డుపై పడి ఉంటే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. వీటిని అస్సలు ఖర్చు పెట్టకూడదు. ఎటువంటి వాటికి ఉపయోగించకూడదు. ఇలాచేస్తే ఆర్థిక సంక్షోభం మరింత ఎక్కువవుతుంది. అయితే ఈ విషయాలన్నింటిని కొంతమంది నమ్ముతారు మరికొందరు నమ్మరు. ఏది ఏమైనప్పటికీ శాస్త్రాల ప్రకారం రోడ్డుపై డబ్బు లభిస్తే ఇలాంటి విషయాలని ఆపాదిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story