తిరుమలలో తక్కువగా భక్తుల రద్దీ

శ్రీవారి దర్శనానికి 3 గంటలు శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం తిరుమలలో భక్తుల తక్కువగా ఉంది.

admin
Updated on: 26 Oct 2019 10:44 AM IST
తిరుమలలో తక్కువగా భక్తుల రద్దీ
X

(తిరుమల, శ్యామ్‌.కె.నాయుడు)

శనివారం శ్రీవారి నిత్యకైంకర్యాలు మినహా ప్రత్యేక‌ సేవలేమి ఉండవు. ఇక సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 3 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనం ద్వారా దర్శించుకునే భక్తులకు గంట, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆధార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు గంటన్నర సమయం పడుతొంది... నిన్నటి రోజు గురువారం 56,955 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, వీరు సమర్పించిన కానుకలతో రూ 3.27 కోట్లు హుండీ ఆదాయం శ్రీవారికి వచ్చింది, 20,837 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని రేపు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది, ఆస్థానం సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

admin

admin

Next Story