Zodiac Signs: కుజ గ్రహ ప్రభావం వల్ల ఈ 3 రాశుల వారికి ఇబ్బందులు.. ఈ పరిహారాలు చేయండి..!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశుల ప్రభావం వల్ల ఒక వ్యక్తి జీవితంలో కష్టనష్టాలని అనుభవిస్తాడు.

Shekhar G
Updated on: 21 Aug 2023 7:01 AM IST
Due To The Influence Of Mars These 3 Zodiac Signs Will Face Problems Doing These Remedies Will Give Good Results
X

Zodiac Signs: కుజ గ్రహ ప్రభావం వల్ల ఈ 3 రాశుల వారికి ఇబ్బందులు.. ఈ పరిహారాలు చేయండి..!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశుల ప్రభావం వల్ల ఒక వ్యక్తి జీవితంలో కష్టనష్టాలని అనుభవిస్తాడు. ఒకే సమయంలో కొంతమందికి మంచి జరిగితే మరికొంతమందికి చెడు జరుగుతుంది. తాజాగా కుజగ్రహం శుక్రవారం సాయంత్రం కన్యారాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 3 వరకు ఇందులోనే సంచరిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి శుభం జరుగుతుంది. మరికొన్ని రాశులవారికి సమస్యలు ఎదురవుతాయి. ఇబ్బందులు పడే రాశుల గురించి ఈరోజు తెలుసుకుందాం.

కుంభ రాశి

కుజగ్రహ ప్రతికూల ప్రభావాల కారణంగా అక్టోబర్ 3 వరకు ఈ రాశివారికి ఉద్యోగ-వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార నిర్వహణలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్తి విషయంలో తోబుట్టువులతో విభేదాలు వస్తాయి. ఈ క్లిష్ట సమయంలో మీరు సంయమనంతో పని చేయాలి లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుంది.

సింహరాశి

ఈ రాశికి చెందిన వ్యక్తులు పనికిరాని విషయాలకు దూరంగా ఉండి తమ పనిపై దృష్టి పెట్టాలి. దీనివల్ల సమస్యలు దరిచేరవు. ఉద్యోగంలో నిమగ్నమైన వారు గాసిప్స్‌లో పడకుండా పనితీరును మెరుగుపరుచుకోవాలి. పేలవమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు సమస్యగా మారవచ్చు. పొరుగువారితో వివాదాలు ఏర్పడుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

వృషభం

కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఆర్థిక సంక్షోభ మొదలవుతుంది. ఆదాయం కంటే మీ ఖర్చులు పెరుగుతాయి. రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందిపడుతారు. జీవిత భాగస్వామితో గొడవలు మొదలవుతాయి. కోపాన్ని, మాటలను నియంత్రించుకోకుంటే దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి.

పరిహారాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం వల్ల కుజుడి దుష్ప్రభావాలను నివారించవచ్చు. పైన ఉండే ఈ 3 రాశులవారు రోజూ ఓం అంగారకాయ నమః అనే మంగళ మంత్రాన్ని జపించాలి. దీంతో పాటు హనుమాన్ చాలీసా పాఠాన్ని చదవాలి. స్థానికులు ప్రతి మంగళవారం సమీపంలోని ఆలయానికి వెళ్లి హనుమంతుని దర్శనం చేసుకోవాలి. గ్రహ దోషాలను నివారించడానికి ఆయనకు లడ్డూలను సమర్పించాలి.

Shekhar G

Shekhar G

Next Story