Palmistry Sign: మీకు అరచేతిలో M గుర్తు ఉందా.. 35 ఏళ్ల తర్వాత పట్టిందల్లా బంగారమే..!

Palmistry Sign: హస్తసాముద్రికం ప్రకారం చేతిలోని రేఖలను బట్టి వారి భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. అందులో కొన్ని నష్టాన్ని కలిగించేవి ఉంటే మరికొన్ని అదృష్టాన్ని అందించేవి ఉంటాయి.

Jyothi
Updated on: 18 March 2024 8:00 PM IST
Do you have an M in your palm according to Hasta Samudrik luck follows you after 35 years
X

Palmistry Sign: మీకు అరచేతిలో M గుర్తు ఉందా.. 35 ఏళ్ల తర్వాత పట్టిందల్లా బంగారమే..!

Palmistry Sign: హస్తసాముద్రికం ప్రకారం చేతిలోని రేఖలను బట్టి వారి భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. అందులో కొన్ని నష్టాన్ని కలిగించేవి ఉంటే మరికొన్ని అదృష్టాన్ని అందించేవి ఉంటాయి. ఒక్కో రేఖకు ఒక్కో అర్థం దాగి ఉంటుంది. కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు ప్రత్యేక గుర్తులు ఉంటాయి. ఈ రోజు అరచేతిలో M గుర్తు ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వీరు 35 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అదృష్టాన్ని పొందుతారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

M గుర్తు ఎక్కడ ఉంటుంది..?

హస్తసాముద్రికం ప్రకారం M గుర్తు కుడి లేదా ఎడమ చేతిపై ఉంటుంది. ఇది అరచేతిపై మూడు గీతలు కలవడం వల్ల ఏర్పడుతుంది. ఇది ఆంగ్ల అక్షరం M ను పోలి ఉంటుంది. చేతులపై ఈ గుర్తు ఉన్నవారు చాలా అదృష్టవంతులు. ఇలాంటి వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వ్యక్తులు చాలా షార్ప్‌గా ఉంటారు.

ఎమ్‌ గుర్తు ఉన్న వ్యక్తులకు రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. ఈ రంగంలో విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు సృజనాత్మకతతో నిండి ఉంటారు. మంచి కళాకారులు, చిత్రకారులు, గాయకులు నటులుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు ప్రేమ విషయాలలో కూడా చాలా అదృష్టవంతులు. వారి వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగుతుంది.

35 ఏళ్ల తర్వాత అదృష్టంవస్తుంది

ఎమ్ గుర్తు ఉన్న వ్యక్తులు జీవిత ప్రారంభంలో కాకుండా 35 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. దీని కారణంగా వారి తెలివితేటలు పెరుగుతాయి. 35 ఏళ్ల తర్వాత వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎదుగుతారు.

Jyothi

Jyothi

Next Story