Daily Horoscope: ఈరోజు మీరోజు! జూలై 31 పంచాంగం, రాశిఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! జూలై 31 పంచాంగం, రాశిఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 31 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం ద్వాదశి (రాత్రి 11-03 వరకు) తదుపరి త్రయోదశి; జేష్ఠ నక్షత్రం (ఉ. 8-33వరకు) తదుపరి మూల నక్షత్రం, అమృత ఘడియలు ( రాత్రి 1-35 నుంచి 3-0వరకు), వర్జ్యం (సా. 4-17 నుంచి 5-50 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-15 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-32 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-41సూర్యాస్తమయం సా.6-31

ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు

ఈరోజు రాశి ఫలాలు

మేషం : చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం : శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ధి. దూరపు బంధువుల కలయిక. భూవివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

మిథునం : వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం : కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఆలయ దర్శనాలు.

సింహం : ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

కన్య : ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి. విందువినోదాలు.

తుల : శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళాకారులకు సన్మానయోగం.

వృశ్చికం : కుటుంబ సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు : కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి, ఉద్యోగాలలో చికాకులు.

మకరం : దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం : మిత్రులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వాహన, గృహయోగాలు.

మీనం : చేపట్టిన పనుల్లో కొద్దిపాటి అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ. దైవచింతన.

Show Full Article
Print Article
Next Story
More Stories