Daily Horoscope: ఈరోజు మీరోజు! జూలై 26 పంచాంగం, రాశిఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

K V D Varma
Published on: 26 July 2020 7:40 AM IST
Horoscope today in telugu
X
Horoscope

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 26 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం షష్ఠి (ఉ.9-32 వరకు) తర్వాత సప్తమి, హస్త నక్షత్రం (మ. 12-37 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 8-06 నుంచి 9-36 వరకు) దుర్ముహూర్తం (సా. 4-57 నుంచి 5-49 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-30 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32

ఈరోజు రాశి ఫలాలు

మేషం

గొప్ప శుభకాలం నడుస్తోంది . కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణము అనుకూలముగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో మంచి ఫలితాలున్నాయి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాదన మానవద్దు.

వృషభం

మొదలుపెట్టిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలావసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృధాచేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి. శివ ఆరాధన మంచినిస్తుంది.

మిథునం

చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

కర్కాటకం

ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధిస్తారు . మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం.

సింహం

చేపట్టిన పనులను దైవానుగ్రహంతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

కన్య

భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

తుల

వృత్తి ఉద్యోగ వ్యాపారములలో మీ అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠిస్తే ఇంకా బాగుంటుంది.

వృశ్చికం

శుభకార్యక్రమములలో పాల్గొని బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మీమీ రంగాల్లో వత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారములలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి . నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది .

ధనుస్సు

మిశ్రమ కాలం. మనోబలం తాగకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

మకరం

అనుకూల ఫలితాలున్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృడంగా

ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కుంభం

మీమీరంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణకార్యసిద్ధి ఉంది. సంపూర్ణమనోబలం కలిగి ఉంటారు . విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

మీనం

మీమీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మిమి రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి . ఒక శుభవార్త మీ మనోధైర్యమును పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

K V D Varma

K V D Varma

Next Story