Daily Horoscope: ఈరోజు మీరోజు! జూలై 25 పంచాంగం, రాశిఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

K V D Varma
Updated on: 25 July 2020 7:08 AM IST
Daily horoscope and telugu panchangam rashiphalalu
X
Daily horoscope rashulu

ఈరోజు పంచాంగం..

ఈరోజు శనివారం, 25 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం పంచమి (మ.12-02 వరకు) తర్వాత షష్టి, ఉత్తర నక్షత్రం (మ. 2-18 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 10-07 నుంచి 11-36 వరకు) దుర్ముహూర్తం (ఉ. 5-47 నుంచి 6-38 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32

ఈరోజు రాశి ఫలాలు

మేషం

మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వారు మీ పట్ల పరిపక్వముగా ఉంటారు. హనుమాన్ చాలీసా పఠించాలి.

వృషభం

కీలక విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. ఆగ్రహావేశాలకు పోకండి. మనసు చెడ్డపనులమీదకు మళ్లుతుంది. శివాష్టోత్తరము పఠించాలి.

మిథునం

మంచి ఉద్దేశ్యంతో మంచిపనులను తలపెడతారు . విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను, నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది .

కర్కాటకం

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్ర సహకారం ఉంది. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సమయానికి నిద్రాహారాలు అవసరం. ప్రయాణ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

సింహం

చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారములో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది.

కన్య

ప్రతిభతో అధికారులను ఆకర్షిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్ర సహకారం ఉంది. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. లలితా దేవిని స్తుతి చేయాలి.

తుల

కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. అనవసర ఖర్చులను తగ్గించాలి. శివారాధన శుభప్రదం.

వృశ్చికం

యశోవృద్ధి ధర్మసిద్ధి ఉన్నాయి. మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయండి.

ధనుస్సు

మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో వ్యతిరేఖ ఫలితాలున్నాయి. చేపట్టేపనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. అనవసర కలహము సూచితం. అలసట పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు వస్తాయి. అష్ట లక్ష్మి స్తుతి మంచిది.

మకరం

చేపట్టిన పనుల్లో తోటివారి సహకారం అందుతుంది. ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. శని శ్లోకం పఠిస్తే బాగుంటుంది.

కుంభం

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

మీనం

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుుంది. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. సూర్యాష్టకము చదివితే బాగుంటుంది.


K V D Varma

K V D Varma

Next Story